తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SL Asia Cup 2023 Final : జయహో భారత్.. ఫైనల్​లో లంక చిత్తు.. ఎనిమిదో టైటిల్ టీమ్ఇండియా వశం! - IND vs SL Asia Cup Schedule

IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్​లో భారత్.. ఛాంపియన్​గా అవతరించింది. ఫైనల్​ మ్యాచ్​లో శ్రీలంకను చిత్తు చేసింది. లంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని (51 పరుగులు).. 6.1 ఓవర్లలో భారత బ్యాటర్లు అలవోకగా ఛేదించారు. దీంతో భారత్ 5 ఏళ్ల ట్రోఫీ కరవును తీర్చుకుంది. ఫలితంగా ఎనిమిదో ఆసియా కప్​ టైటిల్​ను సాధించింది.

IND vs SL Asia Cup 2023 Final
IND vs SL Asia Cup 2023 Final

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 6:08 PM IST

Updated : Sep 17, 2023, 6:48 PM IST

IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్​లో భారత్ ఛాంపియన్​గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్​లో ఆతిథ్య శ్రీలంకను.. భారత్ 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. లంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని (51 పరుగులు).. టీమ్​ఇండియా ప్లేయర్లు 6.1 ఓవర్లలో అలవోకగా ఛేదించారు. దీంతో భారత్ 5 ఏళ్ల ట్రోఫీ కరవును తీర్చుకుంది. ఫలితంగా ఎనిమిదో ఆసియా కప్​ టైటిల్​ను సాధించింది. టీమ్ ఇండియా ఓపెనర్లు శుభ్​మన్ గిల్ (27), ఇషాన్ కిషన్ (23) పరుగులతో రాణించారు.

మరోవైపు శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్‌ (17) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. అయితే ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడం శ్రీ లంక జట్టును దెబ్బతీసింది. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన వరుసగా ఔటవ్వడం వల్ల ఈ మ్యాచ్​లో పరుగులేమీ చేయలేదు. ఇక మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) కూడా పేలవ ప్రదర్శనతో సింగిల్​ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో దిగిన దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడం వల్ల లంక స్కోరు ఆమాత్రమైనా దాటగలిగింది. ఇక భారత్ ఎదుట ఉన్న స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లుగా దిగిన ఇషాన్​, గిల్ సాధించడం వల్ల జట్టు వేగంగానే విజయ పథంలోకి పరుగులు తీసింది. ​ఇక సిరాజ్‌ 6 వికెట్లు.. హార్దిక్‌ పాండ్య మూడు, బుమ్రా ఒక వికెట్‌ తీసి రాణించారు.

IND Vs SL Asia Cup Records :ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోరులో భారత్​తో పాటు శ్రీ లంక జట్టు అనేక రికార్డులను తన ఖాతాలోకి వేసుకుంది. అవేంటంటే..

  1. భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్​గా సిరాజ్​ రికార్డుకెక్కాడు. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఈ లిస్ట్​లో ఉన్నారు.
  2. వన్డే ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సాధించింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంక తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
  3. వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇప్పుడు భారత్‌పై 50 పరుగులకు ఆలౌటైన లంక.. 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌ (2023) మీద త్రివేండ్రం వేదికగా 73 పరుగులు చేసింది.
  4. వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్‌.. ఆసియా కప్‌లోనూ రెండో బెస్ట్‌ ప్రదర్శన కావడం విశేషం. శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్‌ (6/13) తర్వాత సిరాజ్‌ 6/21 స్పెల్‌తో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
  5. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను భారత పేసర్లే తీయడం విశేషం.

Ind Vs Ban Asia Cup Records : 1000కి పైగా పరుగులు.. ఏడాదిలో ఆరో సెంచరీ.. భారత్​-బంగ్లా మ్యాచ్ రికార్డ్స్​ ఇవే

IND vs SL Asia Cup 2023 Final : ఐదేళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో భారత్.. డిఫెండింగ్ ఛాంప్​ను ఆపగలమా!

Last Updated : Sep 17, 2023, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details