IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46*), కేఎల్ రాహుల్ (29*) నిలకడగా ఆడుతున్నారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది టీమ్‌ఇండియా. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌ల మీద టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
IND Vs SA: లంచ్ బ్రేక్.. టీమ్‌ఇండియా స్కోరు 83/0
IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి టీమ్‌ఇండియా వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(46), కేఎల్ రాహుల్(29) ఉన్నారు.
న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన మయాంక్ అగర్వాల్‌కు తోడుగా చాలా రోజుల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ప్రొటీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు చేస్తున్నారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు. రబాడ, ఎంగిడి, జాన్‌సెన్, మల్డెర్ వంటి ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా వికెట్ మాత్రం దక్కలేదు.
కాగా, 2021లో టెస్టుల్లో భారత ఓపెనర్లు వికెట్ పడకుండా 20కు పైగా ఓవర్లుగా ఆడటం ఇది ఏడో సారి. గత పదేళ్లలో(2011-20) చూసుకుంటే ఒక్కసారి కూడా మన ఓపెనర్లు ఇన్ని ఓవర్లు ఆడలేదు.