భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test live score) రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్ 258 వద్ద రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 345 పరుగులకు ఆలౌటైంది. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీతో అదరగొట్టాడు. ఇతడికి తోడు జడేజా (50), అశ్విన్ (38) పోరాటడం వల్ల 345 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో సౌథీ 5 వికెట్లతో రెచ్చిపోగా, జేమిసన్ 3, అజాజ్ పటేల్ 2 రెండు వికెట్లు సాధించారు.
IND Vs NZ Test: లాథమ్, యంగ్ హాఫ్ సెంచరీలు.. రెండోరోజు కివీస్‌దే! - భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు భారత్ ఇన్నింగ్స్
భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test live score) రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ ప్రస్తుతానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 రన్స్ వెనుకంజలో ఉంది.
భారత్-న్యూజిలాండ్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్(50*), విల్ యంగ్(75*) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇవీ చూడండి: యాషెస్ మ్యాచ్‌లు ఇక తెలుగులో.. ఇదే తొలిసారి
Last Updated : Nov 26, 2021, 9:03 PM IST