మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో కీవీస్ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన తదుపరి టీ20 సమరం కోసం ఝార్ఖండ్‌లోని రాంచీకు చేరుకోనున్నారు. ఇప్పటికే రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో టిక్కెట్ల విక్రయం కూడా జోరుగా కొనసాగుతోంది. అభిమానులు భారీగా తరలివచ్చి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వేలాదిగా క్రికెట్ అభిమానులు తరలిరావడంతో పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు అభిమానుల మధ్య వివాదం కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
ఆ ప్లేయర్స్‌కు ధోనీ డిన్నర్ సర్ప్రైజ్.. పోలీసులు-ఫ్యాన్స్ మధ్య ఉద్రిక్తత.. - ధోనీ ఇంట్లో టీమ్ఇండియా ప్లేయర్స్‌కు డిన్నర్
జనవరి 27న రాంచీ వేదికగా జరగనున్న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ కోసం ఇరు జట్లు జనవరి 25న సాయంత్రం రాంచీకి చేరుకోనున్నాయి. ఈ క్రమంలో రాంచీ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్ఇండియా ప్లేయర్స్ కోసం ఓ స్వీట్ సర్ప్రైజ్ఇవ్వనున్నారట. అదేంటంటే..
ధోనీ సర్ప్రైజ్..ఇక రాంచీ అంటే మనకు గుర్తొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీనే కదా. ఐపీఎల్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న మాహీ ఈ క్రమంలో టీమ్ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఓ చిన్న సర్ఫ్రైజ్ ప్లాన్ చేశారు. బయటి వర్గాల సమాచారం ప్రకారం జనవరి 25న టీమ్ఇండియాలోని నలుగురు యంగ్ అండ్ స్టార్ ప్లేయర్స్‌తో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ డిన్నర్ చేయనున్నారట. ఈ నలుగురు ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు ఉన్నాయని టాక్. కాగా నగరంలోని రింగ్ రోడ్‌లోని సిమ్లియాలోని మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ హౌస్‌లో ఈ డిన్నర్ ప్లాన్ ఏర్పాటు చేసినట్లు సమచారం.