Ind s Ire Live Streaming :వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో.. టీమ్ఇండియా యువ జట్టు ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ శుక్రవారం డబ్లిన్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లు ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ అవ్వనున్నాయంటే...
ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ల ప్రసార హక్కులను టీవీ 18 దక్కించుకుంది. దీంతో ఐర్లాండ్ సిరీస్‌కు టీవీ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనుంది. అందుకని ఈ మ్యాచ్‌లు టీవీ 18 ఛానెల్లో టెలికాస్టింగ్ కానున్నాయి. అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ మూడు మ్యచ్‌లకు కూడా డబ్లిన్ మైదానం వేదికకానుంది. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. కాగా చాలా రోజుల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బౌలర్ బుమ్రా.. ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఆయితే ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.