ఎట్టకేలకు క్రికెట్ అభిమానులు, మాజీలు అనుకున్నట్లే జరిగింది. చాలా కాలంగా ఫామ్ లేమితో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌ను.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌కు తప్పించారు. అతడి స్థానంలో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఆడాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ అతడు మూడు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 20, 17, 1 పరుగులే చేశాడు. దీంతో తుది జట్టు నుంచి అతడిని తప్పించాలని వాదనలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా మాజీ పేసర్ వెంకటేశ్.. టీమ్‌మేనేజ్‌మెంట్‌పై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. చాలా మంది ప్లేయర్స్ టీమ్‌లో స్థానం కోసం ఎదురుచూస్తుంటే.. రాహుల్‌కు పదే పదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ తెగ ప్రశ్నించాడు. రాహుల్ గణాంకాలను తెలుపుతూ సెటైర్లు వేశాడు. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు రాహుల్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. గిల్‌ను అడించింది. దీంతో నెట్టింట మీమ్స్ సందడి ఎక్కువైపోయింది. కేఎల్ రాహుల్‌ను తప్పించారని తెలియగానే సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ విషయంపైనే మీమ్స్ కనిపించాయి.
కేఎల్‌ను టీమ్ నుంచి తప్పించారని తెలియగానే మొట్టమొదట ఈ భూమ్మీద ఎక్కువగా సంతోషపడే వ్యక్తి.. వెంకటేశ్ ప్రసాదే అయ్యుంటాడని అని మీమర్స్ రచ్చ రచ్చ చేశారు. 'హమ్మయ్య వెంకటేశ్ ప్రసాద్ ఇక హ్యాపీ' అంటూ మరి కొంతమంది నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేశారు. ఈ విషయం తెలీయగానే వెంకటేశ్ ప్రసాద్ ఇలా డ్యాన్స్ చేసి ఉంటాడేమో అంటూ సరదా వీడియోలను పోస్ట్ చేశారు. ఇంకొంతమంది కేఎల్ రాహుల్ గత ఆటతీరును ఉద్దేశిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. ఓసారి వాటిని చూసేయండి..