తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్ట్ ర్యాంకింగ్స్​లో రోహిత్​ టాప్​.. జైస్వాల్​ కూడా ఆ పొజిషన్​లోకి.. - ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ 2023లో జైస్వాల్​ ప్లేస్

ICC Test Rankings 2023 : ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో పలుపరు టీమ్ఇండియా ప్లేయర్స్ తమ స్థానాలను మెరుగుపరుచుకుని దూసుకెళ్తున్నారు. టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మతో పాటు యంగ్​ ప్లేయర్​ యశస్వి జైస్వాల్​ ఆయా స్థానాలకు ఎగబాకి ముందుకెళ్లారు. ఇంతకీ టెస్ట్​ ర్యాంకింగ్స్​లో వీరి పాయింట్స్ ఎంతంటే..

icc test rankings
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​

By

Published : Jul 26, 2023, 5:27 PM IST

ICC Test Rankings 2023 : టీమ్ఇండియా యంగ్​ స్టార్యశస్వి జైస్వాల్​ ఇటీవల జరిగిన వెస్టిండీస్ టూర్​లో తనదైన ప్రతిభను కనబరిచి అందరిని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్​ నుంచే తన జోరును ప్రదర్శించిన జైస్వాల్​.. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ అదరగొడుతున్నాడు. ఇక తాజాగా వచ్చిన ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​లోనూ సత్తా చాటాడు. సుమారు 11 పాయింట్లు ఎకబాకి 63వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కెప్టెన్​రోహిత్​ శర్మ కూడా తన స్థానాన్ని మెరుగుపరచుకుని 9వ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నేతో కలిసి హిట్‌మ్యాన్ 9వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జైస్వాల్​ వద్ద 466 పాయింట్స్ ఉండగా.. రోహిత్ వద్ద 759 పాయింట్లు ఉన్నాయి.

మరోవైపు రోహిత్​ సహచరులు రిషబ్​ పంత్​, రవీంద్ర జడేజా స్థానాల్లో మార్పులు వచ్చాయి. 743 పాయింట్లతో 12వ స్థానానికి రిషబ్​ పంత్ స్థిరపడగా.. ఒక స్థానం ఎగబాకి జడేజా 39వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ స్థానంలో ఎలాంటి మార్పులు రాలేదు. 22 పాయింట్లు పెంచుకుని 733 వద్ద విరాట్​ కోహ్లీ తన 14వ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక టాప్‌-10 ర్యాంకుల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇప్పటికీ నెంబర్‌ 1గా కేన్‌ విలియమ్సన్‌ కొనసాగుతున్నాడు. ఇక లబుషేన్‌, జో రూట్‌, ట్రవిస్‌ హెడ్‌, బాబర్‌ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు.

బౌలింగ్​లో వాళ్లదే హవా..
ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్​లో ఉన్నాడు. ఇక మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం జడేజా వద్ద 782 పాయింట్స్​ ఉండగా.. అశ్విన్ 879 పాయింట్స్​తో కొనసాగుతున్నాడు. ఇక మరో బౌలర్ అక్షర్​ పటేల్​ ఈ లిస్ట్​లో ఐదవ స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో రెండో టెస్టులో 5 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 33వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. జడేజా మొదటి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details