ICC Test Rankings : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ఇండియాఓడినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానె దూసుకొచ్చాడు. ఆసీస్‌పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో అతడు ఏకంగా 37వ స్థానంలోకి చేరుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ ఆరు స్థానాలను మెరుగుపరుచుకుని 94వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
రోహిత్, విరాట్ ఎక్కడో?
ICC Test Rankings Rohit Kohli : గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ (758) మాత్రమే పదో స్థానంతో టాప్-10లో ఉన్నాడు. రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్‌కు దిగజారిపోయారు. అయితే టాప్-10లో తొలి మూడు స్థానాలు ఆసీస్ బ్యాటర్లవే కావడం విశేషం. లబుషేన్ (903 పాయింట్లు), స్టీవ్ స్మిత్ (885 పాయింట్లు), ట్రావిస్ హెడ్ (884 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు
అశ్విన్‌దే టాప్
ICC Test Rankings Bowlers : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడకపోయినప్పటికీ బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ (860 పాయింట్లు) తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జేమ్స్ అండర్సన్ (850), పాట్ కమిన్స్ (829) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ (777 పాయింట్లు) ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని ఓలీ రాబిన్‌సన్‌తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ విభాగంలో బుమ్రా (772) రెండు స్థానాలను కోల్పోయి 8వ స్థానంలోకి పడిపోయాడు. రవీంద్ర జడేజా (765) యథావిధిగా 9వ స్థానంలోనే ఉన్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా (434) టాప్‌లో ఉన్నాడు.
స్మిత్‌ను దాటేసిన బాబర్
ICC Test Rankings Babarn : టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (862 పాయింట్లు) ఒక ర్యాంక్ కిందికి దిగజారి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టెస్టుల్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ను ఓ విషయంలో మాత్రం అధిగమించాడు. గత 20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక యావరేజ్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాబర్ 69.10 సగటుతో పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక స్టీవ్ స్మిత్ గత 30 ఇన్నింగ్స్‌ల్లో 55.40 సగటుతో పరుగులు రాబట్టాడు. అదే ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ గత 34 ఇన్నింగ్స్‌ల్లో 54.20, ఏంజెలో మ్యాథ్యూస్ గత 16 ఇన్నింగ్స్‌ల్లో 48.40, విరాట్ కోహ్లీ గత 27 ఇన్నింగ్స్‌ల్లో 34.65 సగటుతోనే పరుగులు సాధించారు.