తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు ర్యాంకింగ్స్​లో కొత్త టాపర్.. ఏడుకు పడిపోయిన కోహ్లీ - KL rahul T20 rank

Kohli Rohit: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ అదే స్థానంలో కొనసాగుతుండగా, కోహ్లీ మాత్రం ఏడో స్థానానికి పడిపోయాడు.

Labuschagne
లబుషేన్

By

Published : Dec 22, 2021, 3:06 PM IST

ICC RANKINGS: అంతర్జాతీయ క్రికెట్ మండలి.. తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. వరల్డ్ నం.1 స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.

Labuschagne: యాషెస్​లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆసీస్ బ్యాటర్ లబుషేన్(912 పాయింట్ల).. జోరూట్​ను(897) వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. చివరగా న్యూజిలాండ్​తో రెండో టెస్టు ఆడిన కోహ్లీ.. ఓ స్థానం దిగజారి ఆరు నుంచి ఏడుకు పడిపోయాడు. రోహిత్ శర్మ.. ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో అశ్విన్.. రెండులోనే ఉన్నాడు.

కోహ్లీ

టీ20 బ్యాటర్​ ర్యాంకింగ్స్​లో బాబర్ ఆజామ్ తిరిగి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత వారం వెస్టిండీస్​తో టీ20ల్లో వరుసగా 0,7 స్కోర్లు చేసిన బాబర్.. అగ్రస్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ వారంలోనే దానిని తిరిగి దక్కించుకున్నాడు.

KL Rahul rank: అలానే బాబర్​తో కలిసి అగ్రస్థానాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ పంచుకున్నాడు. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కెరీర్​లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత పరిమిత ఓవర్ల కొత్త వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఐదో స్థానానికి చేరుకున్నాడు. టాప్-10 బౌలర్ల జాబితాలో భారత్​ నుంచి ఎవరూ లేరు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details