ICC T20 Ranking :ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో, టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అతడు 699 రేటింగ్స్‌తో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 855 రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్నాడు. దీంతో టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమ్ఇండియా ప్లేయర్లే టాప్‌లో ఉండడం విశేషం.
Ravi Bishnoi T20 Career :23 ఏళ్ల బిష్ణోయ్, గతేడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 2 వికెట్ల ప్రదర్శన చేశాడు బిష్ణోయ్. కెరీర్లో ఇప్పటివరకూ 21 మ్యాచ్‌ల్లో అతడు, 34 వికెట్లు పడగొట్టాడు. ఇక రీసెంట్గా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఇక 692 రేటింగ్స్‌తో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో బిష్ణోయ్, రషీద్ ఖాన్ సహా టాప్ 5 గురు బౌలర్లు స్పిన్నర్లే కావడం గమనార్హం.
టాప్ - 5 బౌలర్లు
- తొలి స్థానం - రవి బిష్ణోయ్ - 699 రేటింగ్స్
- రెండో స్థానం - రషీద్ ఖాన్ - 692 రేటింగ్స్
- మూడో స్థానం - వానిందు హసరంగ - 679 రేటింగ్స్
- నాలుగో స్థానం - ఆదిల్ రషీద్ - 679 రేటింగ్స్
- ఐదో స్థానం - మహీషా తీక్షణ - 677 రేటింగ్స్