ICC Olympic Cricket: సంపాదన లక్ష్యంగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్ వేయడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈవో గెఫ్ అలార్డైస్ వ్యాఖ్యానించారు. క్రికెట్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంతోపాటు నాన్-క్రికెటింగ్ మార్కెట్‌కీ విస్తరించడమే ప్రధాన ధ్యేయమని వివరించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌కు స్థానం దక్కింది. 1998లోనే పురుషుల క్రికెట్ అరంగేట్రం అయింది. "బోర్డులోని సభ్యులు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని కోరుకుంటున్నారు. సౌకర్యాలు, అత్యుత్తమ ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు ప్రయోజకరంగా ఉంటుంది" అని అలార్డెస్ పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఐసీసీ సీఈవో ఏమన్నారంటే? - ఒలింపిక్ క్రికెట్
ICC Olympic Cricket: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే తమ ఉద్దేశం వెనుక సంపాదన లక్ష్యం లేదని అన్నారు ఐసీసీ సీఈవో గెఫ్ అలార్డైస్. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసి మార్కెట్‌ను విస్తరించడమే తమ ధ్యేయమని చెప్పారు.
"ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండటం మా దృష్టిలో సంపాదన లక్ష్యం మాత్రం కాదు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసి మార్కెట్‌ను విస్తరించడమే మా ధ్యేయం. దీనివల్ల మా కమిటీలోని 106 మంది సభ్యులకు వారి దేశాల ప్రభుత్వాలతో మరింత సన్నిహితంగా కలిసే అవకాశం దక్కుతుంది. బలమైన సంబంధాలతో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్పించేందుకు కృషి చేసేందుకు అక్కరకొస్తుంది’’ అని సీఈవో అలార్డెస్ తెలిపారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం కోసం బిడ్ వేయాలనే నిర్ణయానికి ఐసీసీ వచ్చింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోకానీ, 2032 బ్రిస్బేన్ వేదికగా జరిగే క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ కృషి చేస్తోంది.
ఇదీ చూడండి: IPL 2022: మూడో మ్యాచ్‌లోనూ చెన్నై దారుణ ఓటమి.. దూబే పోరాడినా..