ఆగస్టు నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (icc player of the month) నామినీలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ. అందులో భాగంగానే ఆగస్టు నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.
"పురుషుల క్రికెట్లో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పోటీలో నిలిచారు. మహిళల క్రికెట్లో ఐర్లాండ్‌కు చెందిన క్రికెటర్లు గాబీ లూయిస్, ఈమియర్ రిచర్డ్‌సన్‌తో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన నట్టాయా బూచాతమ్ పేర్లను పరిగణలోకి తీసుకున్నాం."