టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకునేందుకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి.. జూన్ 28 వరకు సమయాన్నిచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ముందు నుంచి భారత్ భావిస్తున్నట్లుగానే ఐసీసీ దాదాపు నెల రోజులనిచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కొవిడ్ వల్ల ఇప్పటికే ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఐసీసీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వర్చువల్‌గా సమావేశమయ్యారు.
"అవును, బీసీసీఐ కోరినట్లుగా టీ20 ప్రపంచకప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ నెల రోజుల సమయాన్నిచ్చింది. అప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌పై ఆతిథ్యమిచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డుకు అవకాశముంది. తదుపరి వారు మరోసారి భేటీ కానున్నారు."