తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ibrahim Zadran Afghanistan : పాక్​ వెళ్లగొట్టిన ప్రజలకు అవార్డు అంకితమిచ్చిన అఫ్గాన్​ ప్లేయర్​.. ఎందుకో తెలుసా?

Ibrahim Zadran Afghanistan : చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ను అఫ్గానిస్థాన్ చిత్తు చేసింది. ఈ క్రమంలో పాక్​ ​పరాజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును అందుకున్నాడు అఫ్గాన్ బ్యాటర్​ ఇబ్రహీం జద్రాన్. అయితే మ్యాచ్​ తర్వాత ఈ ప్లేయర్​ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..

Ibrahim Zadran Afghanistan : పాక్​ పంపిచేసిన మా అఫ్గాన్​ వాసులకు.. మ్యాన్ అఫ్​ ది మ్యాచ్​ అంకితం..
Ibrahim Zadran Afghanistan : పాక్​ పంపిచేసిన మా అఫ్గాన్​ వాసులకు.. మ్యాన్ అఫ్​ ది మ్యాచ్​ అంకితం..

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 3:33 PM IST

Ibrahim Zadran Afghanistan : ప్రస్తుతం ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​ మరోసారి విజృంభించింది. ఇప్పటివరకు పాకిస్థాన్ చేతిలో ఓడిపోతూ వచ్చిన అఫ్గాన్.. ఈ సారి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాక్​ విధించిన 283 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. జట్టు విజయంలో అఫ్గాన్​ బ్యాటర్​ ఇబ్రహీం జద్రాన్​ బలమైన పునాదులు వేశాడు. ఈ క్రమంలో ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కించుకున్నాడు.

అయితే మ్యాచ్​ తర్వాత ఇబ్రహీం జద్రాన్​ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "నేను ఈ మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును పాక్​ నుంచి బలవంతంగా వెళ్లగొట్టిన నా అఫ్గానిస్థాన్​ వాసులకు అంకితం చేస్తున్నాను" అని ఇబ్రహీం అన్నాడు. పాకిస్థాన్​పై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్​గా మారాయి.

" ఈ మ్యాచ్​లో సానుకూల దృక్పథంతో ఆడాలని ముందే నిర్ణయించకుని బరిలోకి దిగాను. నేను గుర్భాజ్​ అండర్​-16 నుంచి కలిసి ఆడాం. ఇప్పటికే చాలా సార్లు మేము కలిసి ఆడటం వల్ల గుర్బాజ్​తో నాకు మంచి అవగాహన ఉంది. మైదానంలో గుర్భాజ్​ నాకు అండగా ఉండటం వల్ల విజయం సాధించడానికి అనుకూలమైంది. ఈ విజయంతో నేను, నా దేశం గర్వంగా ఫీలవుతున్నాం." - ఇబ్రహీం జద్రాన్

అసలేం జరిగిందంటే.. వాస్తవానికి తాలిబన్ల యుద్ధాల కారణంగా కొన్నేళ్ల క్రితమే లక్షల మంది అఫ్గాన్​ వాసులు తలదాచుకోవడానకి పాకిస్థాన్​కు వచ్చారు. అక్కడే శరణార్థులుగా ఇప్పుటి వరకూ చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు దాదాపు 17 లక్షల పైగానే ఉండొచ్చు అని అంచనా. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం సరైన ధ్రువపత్రాలు లేని విదేశీయులను తమ దేశం నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం నవంబర్​ 1 వరకు గడువును నిర్దేశించింది.

ఈ నేపథ్యంలో గతిలేక అఫ్గాన్​ వాసులు పాక్​ను వీడుతున్నారు. అక్టోబర్​ 21న 3,248 అఫ్గాన్​ పౌరులను పాక్​ను వీడినట్లు.. ఇప్పటివరకు 51 వేల మందిని దేశం నుంచి పంపించి వేసినట్లు పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై అఫ్గాన్​ వాసుల్లో అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం ఏర్పడింది. దీంతో తాజాగా జద్రాన్ చేసిన​ వ్యాఖ్యలు అప్గాన్​ శరణార్థులకు సంఘీభావం తెలిపినట్లైంది.

ODI World Cup 2023 Afghanistan Records : పాకిస్థాన్​పై అద్భుత విజయం.. అఫ్గాన్ నమోదు చేసిన​ 8 రికార్డులివే

ODI World Cup 2023 PAK VS AFG : అఫ్గాన్​ సంచలన విజయం వెనక టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్!

ABOUT THE AUTHOR

...view details