స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar).. తన బౌలింగ్, స్వింగ్, వేగం గురించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలో చాలా నెమ్మదిగా బౌలింగ్ చేసేవాడినని అన్నాడు. దానికి పేస్ జోడించడం ఎంత ముఖ్యమో తర్వాతి కాలంలో తెలుసుకున్నానని చెప్పాడు.
"నిజం చెప్పాలంటే, కెరీర్ ప్రారంభంలో నా బౌలింగ్‌లో పేస్ ప్రాముఖ్యాన్ని తెలుసుకోలేకపోయాను. స్వింగ్‌తో 120-130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నంటే బ్యాట్స్‌మన్ కుదురుకుంటున్నారు. దాంతో నా బౌలింగ్‌లో పేస్ పెంచాలని నిర్ణయించుకున్నాను. ఎలా చేయాలో తెలియనప్పటికీ క్రమక్రమంగా ఆ విషయంలో మెరుగుపడ్డాను" అని భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు.