తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ సంచలన ప్రకటన.. త్వరలోనే పొలిటికల్ గేమ్ షురూ! - బీసీసీఐ

Sourav Ganguly: భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు దాదా. త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Sourav Ganguly
is sourav ganguly joining bjp

By

Published : Jun 1, 2022, 5:58 PM IST

Updated : Jun 1, 2022, 7:01 PM IST

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సౌరవ్​ గంగూలీ కీలక ప్రకటన చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

గంగూలీ పోస్ట్

"1992లో క్రికెట్​లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాటి నుంచి క్రికెట్​ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని ఈ రోజు నిర్ణయించుకున్నా. నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని దాదా ట్వీట్ చేశారు.

బీసీసీఐ పదవికి రాజీనామా చేస్తారా?: అయితే గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాదా.. భాజపాలో చేరనున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయనున్నారనేది గంగూలీనే త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అవన్నీ అవాస్తవాలే: మరోవైపు.. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలను కొట్టిపారేశారు ఆ సంస్థ కార్యదర్శి జైషా. అవన్నీ అవాస్తవాలేనని, గంగూలీ రాజీనామా చేయలేదని స్పష్టంచేశారు. టీమ్​ఇండియా తదుపరి ప్రాజెక్టులపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ఆ కీలక పదవి కోసం గంగూలీ వర్సెస్​ జై షా?

Last Updated : Jun 1, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details