శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమ్ఇండియా కెప్టెన్‌గా అవకాశం కల్పించడంపై శిఖర్ ధావన్ స్పందించాడు. సదరు నిర్ణయాన్ని గొప్పగా భావిస్తున్నట్లు తెలిపాడు.
"దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు" అని ధావన్ ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు 34 టెస్టులతో పాటు 145 వన్డేలు, 65 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు గబ్బర్. జులై 13 నుంచి 25 వరకు మూడు టీ20లు ఆడడానికి భారత జట్టు లంకలో పర్యటించనుంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. ఈ సిరీస్ కోసం కొత్త ముఖాలను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. క్రిష్ణప్ప గౌతమ్, దేవ్‌దత్ పడిక్కల్, నితీష్ రానా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియాలకు తొలిసారి జట్టులో చోటు దక్కింది.
ఇదీ చదవండి:WTC Final: 'ఆ స్థానంలో నా ఓటు శార్దుల్‌కే'