తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​ ప్రారంభమైతే.. ఆడేందుకు నేను సిద్ధం'

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​.. తిరిగి ప్రారంభమైతే ఆడటానికి తాను సిద్ధమని తెలిపాడు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. లీగ్​లో రాజస్థాన్​ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్​.. వేలి గాయం కారణంగా ఈ సీజన్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు.

jofra archer, england cricketer
జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ క్రికెటర్

By

Published : May 16, 2021, 7:20 AM IST

కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ మళ్లీ మొదలైతే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ పేసర్​ జోఫ్రా ఆర్చర్​ అన్నాడు. రాజస్థాన్​ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్​.. గాయం కారణంగా ఈసారి లీగ్​లో అడుగే పెట్టలేదు. అయితే టోర్నీని ఎప్పుడు పునఃప్రారంభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్చర్​ చెప్పాడు.

"ఐపీఎల్​ ఆడేందుకు భారత్​కు వెళ్లలేకపోవడం చాలా క్లిష్టమైన విషయం. గాయం అయినప్పుడు రాజస్థాన్​ రాయల్స్​ నాకెంతో మద్దతుగా నిలిచింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయిన టోర్నీ తిరిగి షెడ్యూల్​ అయితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నా" అని ఆర్చర్​ ట్వీట్​ చేశాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ స్థాయి వేరు: పాక్​ పేసర్​

ఈ జనవరిలో ఆర్చర్​ చేతి వేలికి గాయం అయింది. అయినా కూడా అతడు భారత్​తో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్​లో ఆడాడు. కానీ గాయం ఇబ్బంది పెట్టడం వల్ల మధ్యలోనే మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ భారత్​కు రాలేదు. ఐపీఎల్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. ప్రస్తుతం ససెక్స్​ తరఫున కౌంటీ క్రికెట్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆర్చర్​ ఫామ్​ నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నాడు. న్యూజిలాండ్​తో రెండు టెస్టుల సిరీస్​ ముంగిట ఆర్చర్​ అందుబాటులోకి రావడం ఇంగ్లాండ్​కు చాలా కీలకం.

ఇదీ చదవండి:ఇటాలియన్​ ఓపెన్​ ఫైనల్లోకి రఫా

ABOUT THE AUTHOR

...view details