తెలంగాణ

telangana

ETV Bharat / sports

మైదానంలో దిగిన హెలికాప్టర్.. మ్యాచ్​కు అంతరాయం - బ్రిస్టోల్ న్యూస్

రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగానే ఓ హెలికాప్టర్ మైదానంలో ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, అంపైర్లు మైదానం నుంచి పక్కకు వెళ్లారు. 20 నిమిషాల అంతరాయం తర్వాత మ్యాచ్​ తిరిగి ప్రారంభమైంది.

helicopter
హెలికాప్టర్

By

Published : Sep 21, 2021, 7:57 PM IST

ఇంగ్లాండ్ బ్రిస్టోల్ వేదికగా కౌంటీ ఛాంపియన్​షిప్​లో భాగంగా ఓ మ్యాచ్​ జరుగుతుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో హెలికాప్టర్ దిగిన కారణంగా మ్యాచ్​కు అంతరాయం ఏర్పడింది. గ్లౌసెస్టర్​షైర్, దుర్హామ్​ మధ్య మ్యాచ్​ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది.

ఏం జరిగిందంటే?

టాస్​ గెలిచిన దుర్హామ్ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది. మొదటి ఓవర్ ప్రారంభం కాగానే అంపైర్ సహా ఆటగాళ్లందరూ మైదానం విడిచివెళ్లారు. హెలికాప్టర్​ ల్యాండ్​ అవుతున్న కారణంగా ఇలా చేశారు. అనంతరం అది 'గ్రేట్​ వెస్టర్న్ ఎయిర్ అంబులెన్స్' సంస్థకు చెందిన హెలికాప్టర్ అని తెలిసింది. డొనేషన్ల ద్వారా నడిచే ఈ సంస్థ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. మైదానం వెలుపల ఓ ఘటన జరిగిన నేపథ్యంలో ఆ హెలికాప్టర్​ ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు సంస్థ పేర్కొంది.

హెలికాప్టర్​ మైదానంలో దిగిన తర్వాత.. ఘటనకు సంబంధించిన బాధితుడిని తీసుకొని వెళ్లేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. అనంతరం మళ్లీ మ్యాచ్​ యథావిధిగా జరిగింది. అత్యవసర సేవల నిమిత్తం మైదానంలో ఆటగాళ్లు పక్కకు తప్పుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు జీడబ్ల్యూఏఏసీ సంస్థ సీఈఓ అన్నా పెర్రీ. ఆటగాళ్లకు, అంపైర్లకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాచ్​ జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది.

ఇదీ చదవండి:

పాక్-ఇంగ్లాండ్ సిరీస్ రద్దు.. ఐపీఎల్​కు మరింత జోష్

ABOUT THE AUTHOR

...view details