తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరో సూపర్​ రికార్డుకు చేరువలో హర్మన్‌.. మిథాలీని అధిగమిస్తుందా? - హర్మన్​ ప్రీత్​ కౌర్​ టీ20 పరుగులు

Harmanpreetkaur Mithali raj: టీమ్​ఇండియా మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్ను తన ఖాతాలో వేసుకోనుంది. అదేంటంటే..

Mithali raj Harman preet kaur
హర్మన్​ ప్రీత్​ కౌర్ మిథాలీ రాజ్​

By

Published : Jun 22, 2022, 10:06 AM IST

Harmanpreetkaur Mithali raj: టీమ్​ఇండియా మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో రికార్డు్కు చేరువైంది. టీ20ల్లో ఆమె మరో 45 పరుగులు చేస్తే భారత మహిళల జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలవనుంది. ఇటీవల అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ (89 మ్యాచులు, 2364 పరుగులు) అగ్రస్థానంలో ఉంది. హర్మన్‌ ప్రీత్‌ (121 మ్యాచ్‌లు, 2319 పరుగులు) రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుతం భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూన్‌ 23 నుంచి దంబుల్లాలో శ్రీలంకతో టీమ్‌ఇండియా మూడు టీ 20 మ్యాచ్‌లు (జూన్ 23, 25, 27) ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి క్యాండీలో మూడు వన్డేలు (జులై 1, 4, 7, తేదీల్లో) జరుగుతాయి. ఈ టీ20 సిరీస్‌లో మిథాలీ రికార్డును హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

కాగా, హర్మన్‌ప్రీత్ 2009లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత మహిళల జట్టుకు కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది. 2018 టీ20 ప్రపంచకప్‌లో ఆమె న్యూజిలాండ్‌పై శతకం బాదింది. ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున శతకం బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్‌ రిటైర్‌మెంట్ ప్రకటించడం వల్ల సెలెక్షన్‌ కమిటీ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చూడండి:లంక రికార్డ్​ విక్టరీ.. 30ఏళ్ల తర్వాత ఆసీస్​పై...

ABOUT THE AUTHOR

...view details