Hardik pandya World Cup 2023 :వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవలేబంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే వచ్చే ఆదివారం (అక్టోబర్ 29న) ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. బీసీసీసీఐ వర్గాలు కూడా హార్దిక్ బరిలోకి దిగుతాడని వ్యక్తం చేశాయి. అయితే, తాజాగా హార్దిక్ రీఎంట్రీపై ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. రానున్న మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో (నవంబర్ 2న) జరిగే మ్యాచ్‌కూ హార్దిక్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ఎన్సీఏలో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ ప్రస్తుతం వేగంగానే కోలుకుంటున్నాడట. అయినప్పటికీ అతడి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరి కొద్ది రోజులు హార్దిక్ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలిసింది.
మరోవైపు వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన.. లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపిస్తే ఇక టీమ్ఇండియా దాదాపు సెమీస్‌కు చేరడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించాలనే కసితోనే భారత్ సేన కూడా ఆడుతోంది. దీంతో రానున్న మ్యాచ్‌లనూ భారత్‌దే పైచేయి అవ్వడం ఖాయమవ్వనుంది.