తెలంగాణ

telangana

ETV Bharat / sports

హార్దిక్​-కేన్​ విలియమ్స్​ రిక్షా సవారీ... వీడియో వైరల్​ - ఇంగ్లాండ్​ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌

టీ20 ప్రపంచకప్​లో ఓటమి తర్వాత​.. కివీస్​తో తలపడేందుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలోతాజాగా ఇరు జట్ల కెప్టెన్లు కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. రోడ్లపై రిక్షా సవారీ చేస్తూ కనిపించారు. ఆ వీడియో చూసేయండి..

hardik pandya kane williamson ride
కేన్‌ విలియమ్స్‌తో కలిసి హార్దిక్​ పాండ్యా రిక్షా సవారీ

By

Published : Nov 16, 2022, 5:21 PM IST

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచే వెనుదిరిగిన టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. నవంబర్‌ 18 నుంచి కివీస్‌తో 3 వన్డేలు, 3 టీ20లు భారత్ ఆడనున్నాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దాంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీ20 జట్టుకు నాయత్వం వహించనున్నాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌తో కలిసి హార్దిక్​ పాండ్యా చేసిన రిక్షా సవారీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తొలి మ్యాచ్‌ ముంగిట వీరిద్దరూ వెల్లింగ్టన్‌ రోడ్ల మీద సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రత్యర్థి జట్ల సారథులను ఇలా చూడటం గొప్పగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సీనియర్లు లేకపోవడం లోటే కానీ.. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ గొప్ప అవకాశమంటూ పాండ్యా ఇటీవల స్పందించాడు.

ABOUT THE AUTHOR

...view details