Hardik Pandya Jamnagar Welcome: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పాండ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ విజిట్‌లో భాగంగా డిసెంబర్ 19న గుజరాత్ జామ్‌నగర్ వెళ్లాడు. అయితే అక్కడ పాండ్యకు ఘన స్వాగతం లభించింది. ఇండస్ట్రీ గేట్ బయట పాండ్యకు గుర్రాలు, బ్యాండ్ బాజాతో స్వాగతం పలికారు. అయితే ఆలస్యంగా వెలులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.
Hardik Pandya Ruled Out: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, 2024 జనవరిలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన హార్దిక్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోనందున అతడు ఇంకొన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు. అయితే మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ ఉన్నందున హార్దిక్‌ను ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడించడానికి బీసీసీఐ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Hardik Pandya Mumbai Indians : ట్రేడింగ్ పద్ధతిలో హార్దిక్ పాండ్య ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. కాగా, అతడికి ఫ్రాంచైజీ యాజమాన్యం కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న పాండ్య, 2024 ఐపీఎల్‌లోనూ ఆడటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.