తెలంగాణ

telangana

By

Published : May 1, 2021, 8:34 PM IST

ETV Bharat / sports

కరోనా బాధితులకు అండగా పాండ్యా సోదరులు

కరోనా బాధితులకు సాయంగా నిలిచారు టీమ్ఇండియా ఆల్​రౌండర్లు హార్దిక్, కృనాల్ పాండ్యా. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు సరిగాలేని ప్రాంతాలకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళంగా ప్రకటించారు.

Hardik and Krunal Pandya
పాండ్యా సోదరులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి సాయం చేయడానికి పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. తాజాగా కొవిడ్ బాధితుల సహాయార్థం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను విరాళంగా ప్రకటించారు టీమ్ఇండియా ఆల్​రౌండర్లు హార్దిక్, కృనాల్ పాండ్యా.

"భారత్​లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ అయితే మెడికల్ సదుపాయాలు సరిగాలేవో వారికి సాయంగా 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను అందిస్తున్నాం. ఈ కఠిన పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఈ సహాయానికి ముందుకొచ్చాం" అని తెలిపారు పాండ్యా సోదరులు.

ఇప్పటికే టీమ్ఇండియా క్రికెటర్లు వారికి తోచిన సాయం చేశారు. ఈరోజు మధ్యాహ్నం అజింక్యా రహానే 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను సాయంగా అందించాడు. ఇప్పటికే సచిన్, కమిన్స్, బ్రెట్​లీ, శ్రీవత్స్ గోస్వామి తదితరులు కొవిడ్ బాధితులకు అండగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details