తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒత్తిడిలో ఎలా ఆడాలో విరాట్‌ను చూసి నేర్చుకోండి: గంభీర్​

ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్‌ను చూసి సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్ నేర్చుకోవాలని గౌతమ్​ గంభీర్​ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్​లో తొలి ఓటమిని చవి చూసిన భారత్​.. ఆ మ్యాచ్​లో వీరిద్దరి బ్యాటింగ్​ తీరుపై విమర్శలకు ఆయన ఇలా స్పందించాడు.

Gambhir comments on kohli and pant
Gambhir comments on kohli and pant

By

Published : Sep 6, 2022, 9:00 AM IST

ఆసియా కప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సూపర్‌-4లో భారత్‌పై పాకిస్థాన్‌ మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (60) అర్ధశతకంతో రాణించాడు. అయితే అనవసర షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరిన రిషభ్‌ పంత్ (14), సూర్యకుమార్‌ యాదవ్ (13) బ్యాటింగ్‌ తీరుపై విమర్శలు రేగాయి. మరీ ముఖ్యంగా రిషభ్ పంత్ రివర్స్ స్వీప్‌ ఆడి అసిఫ్‌ అలీ చేతిలో క్యాచ్‌ పెట్టాడు. ఈ క్రమంలో పంత్‌, సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని గంభీర్‌ పేర్కొన్నాడు.

"బ్యాటింగ్‌ లైనప్‌ ఫ్లెక్సిబుల్‌గా ఉండటం నాకిష్టం. ఓపెనర్లతో పాటు మూడు, నాలుగో స్థానాల్లో వచ్చే బ్యాటర్లూ కుదురుకోవాలి. విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్‌ ఫామ్‌ను బట్టి మూడో స్థానంలో రావాల్సి ఉంది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా పరుగులు రాబట్టాడు. అందుకే ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్‌ను చూసి సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్ నేర్చుకోవాలి. ప్రతిసారి భారీ షాట్లు కొట్టేందుకు వీలు ఉండదు. అయితే విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు అనసవర షాట్లకు పెవిలియన్‌కు చేరారని అనిపిస్తోంది. సింగిల్స్‌ను డబుల్స్‌గా మారుస్తూ కోహ్లీ స్కోరు బోర్డును నడిపించాడు. ఇలా ఆడితేనే కీలకమైన మ్యాచుల్లో ఒత్తిడి లేకుండా ఓవర్‌కు 10 నుంచి 11 పరుగులు రాబట్టే అవకాశం ఉంది" అని గంభీర్‌ విశ్లేషించాడు.

ABOUT THE AUTHOR

...view details