Asad Rauf Selling Clothes: 1996 క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ టీంలో భాగమైన శ్రీలంక క్రికెటర్ రోషన్ మహానమా.. ఇటీవల సంక్షోభం నేపథ్యంలో టీ, బన్ అమ్ముకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఓ పాక్ మాజీ అంపైర్, ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోనూ చోటు దక్కించుకున్న అసద్ రవూఫ్.. పాకిస్థాన్ లాహోర్‌లోని లాండా బజార్లో బట్టల షాప్ నడుపుతున్నాడు. దుస్తులు, పాదరక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
2000-13 మధ్యలో మొత్తం 170 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు అసద్. ఆ తర్వాత నిషేధానికి గురైన అతడు.. క్రికెట్‌ను వదిలేశాడు. ఇప్పుడు నడిపే స్టోర్ తన కోసం కాదని, తన సిబ్బంది రోజువారీ ఖర్చుల కోసమని చెప్పడం విశేషం.
''నేను చాలా మ్యాచ్‌లకు అంపైర్‌గా పనిచేశాను. నేను చూడటానికి ఇంకేం లేదు. 2013 తర్వాత.. నేనసలు క్రికెట్‌ను అనుసరించట్లేదు. నేను ఒకటి వదిలేస్తే.. అది జీవితాంతం విడిచిపెట్టినట్లే.''