భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా సన్నద్ధతపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కఠిన సాధనతోనే, ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో విజయం సాధించగలమని స్పష్టం చేశాడు.
కఠోర శ్రమతోనే..
'ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రతిరోజూ కఠిన సాధన అవసరం. కఠోరంగా శ్రమిస్తూ, మనకు మనం చెప్పుకోవాలి. పరిస్థితులను అధిగమించాలని నిశ్చయించుకోవాలి. పనిభారం, మానసిక భారానికి సిద్ధపడి ఉండాలి' అని కోహ్లీ చెప్పాడు.
ఇంగ్లాండ్‌లో ఆ జట్టుపై విజయం సాధించటం.. వేరేచోట గెలవడం కంటే ఎక్కువని కోహ్లీ అన్నాడు. మైదానంలో దిగిన తర్వాత ప్రతి మ్యాచ్ సొంతం చేసుకోవాలనే దృక్పథంతోనే ఆడతామన్నారు. రికార్డుల కోసం ఆడొద్దని, అలా అనుకుంటే తాను ఇప్పటివరకు సాధించిన విజయాల్లో సగం కూడా అందుకునేవాడిని కానని స్పష్టం చేశాడు. కఠోరమైన సాధనతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశాడు.
శార్దుల్ చేయగలడు..
బౌలర్ శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగలడని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె అన్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో లోయర్ ఆర్డర్లో శార్దుల్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నట్లు సంకేతాలు పంపాడు.