తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీపై మాజీ క్రికెటర్​ విమర్శలు.. తిప్పికొట్టిన నెటిజన్లు - నిక్​ కాంప్టన్​ విరాట్​ కోహ్లీ

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నోరు తెరిస్తే బుతు మాటలే వస్తున్నాయని ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ నిక్​ కాంప్టన్​ అన్నాడు. దీంతో​ కాంప్టన్​పై భారత అభిమానులు విమర్శలు దాడి చేస్తున్నారు. లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లిష్​ ఆటగాళ్లు బుమ్రాను దూషించినప్పుడు నోరెందుకు తెరవలేదని ప్రశ్నిస్తున్నారు.

Nick Compton Faces Backlash Over Virat Kohli Remark
'కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే!'

By

Published : Aug 19, 2021, 11:38 AM IST

Updated : Aug 19, 2021, 1:59 PM IST

'కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే..' అంటూ ట్వీట్‌ చేసిన ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌పై భారత అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఇంగ్లాండ్‌ క్రీడాకారులు బుమ్రాను దూషించినప్పుడు నోరెందుకు తెరవలేదని ప్రశ్నిస్తున్నారు. అండర్సన్‌ అశ్లీల పదజాలం వాడినప్పుడు వినపడలేదా అని ఘాటుగా బదులిస్తున్నారు.

"నోరు తెరిస్తే విరాట్‌ కోహ్లీ కన్నా ఎక్కువ బూతులు మాట్లాడే వ్యక్తి మరొకరు ఉండరు కదా! 2012లో నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను మర్చిపోలేను. అలా చేసి తనను తానే తక్కువ చేసుకున్నాడు. దీనివల్ల జోరూట్‌, తెందుల్కర్‌, విలియమ్సన్‌ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది."

- నిక్‌ కాంప్టన్‌, ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​

దీన్ని చూసిన భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. "అశ్విన్‌ను అండర్సన్‌ అవమానించినప్పుడు, వీడ్కోలు పోరులో ఫిలాండర్‌ను బట్లర్‌ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు? నిజానికి బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇదంతా మొదలుపెట్టింది ఇంగ్లాండే కదా" అని ఒకరు బదులిచ్చారు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌ జట్టు బుమ్రాతో ప్రవర్తించిన తీరును షేన్‌వార్న్‌ సహా మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇంగ్లాండ్‌ దిగ్గజాలే తమ జట్టు ఆటతీరును చూసి సిగ్గుపడుతున్నట్టు ప్రకటించారు!

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్నారు. బుమ్రాను లక్ష్యంగా ఎంచుకొని అండర్సన్‌, బట్లర్‌ మిగిలిన క్రీడాకారులు దూషించారు. పదేపదే కవ్వించారు. ఆ తర్వాత టీమ్‌ఇండియా ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా బదులిచ్చింది. అటు మాటలు బదులివ్వడమే కాకుండా ఆటలోనూ తిరుగులేని ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో చురుగ్గా కదులుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు.

ఇదీ చూడండి..పారాలింపిక్స్​లో ఆడాలనుంది- అఫ్గాన్​ క్రీడాకారిణి ఆవేదన

Last Updated : Aug 19, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details