నాలుగో టెస్టులోనూ(IND Vs ENG 4th Test) టీమ్‌ఇండియా ఆటతీరు మారలేదు. అలవాటైన పద్ధతుల్లోనే మళ్లీ వికెట్ల సమర్పణ ప్రారంభించింది. తొలి రోజు తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఇంగ్లాండ్ పేసర్లు అండర్సన్, రాబిన్‌సన్, క్రిస్‌వోక్స్ చెలరేగడం వల్ల ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. దాంతో తొలి సెషన్ ముగిసేసరికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), రవీంద్ర జడేజా(2) ఉన్నారు.
IND Vs ENG: లంచ్ విరామానికి టీమ్ఇండియా 54/3 - ఇండియా vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు(IND Vs ENG 4th Test) తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వల్ల లంచ్ విరామానికి మూడు వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది.
IND Vs ENG: లంచ్ విరామానికి టీమ్ఇండియా 54/3
అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(11), రాహుల్(17)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా(4) విఫలమయ్యాడు. తొలుత వోక్స్ రోహిత్‌ను ఔట్‌చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించగా కాసేపటికే రాహుల్, పుజారాను రాబిన్‌సన్, అండర్సన్ పెవిలియన్ పంపారు. దాంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, కోహ్లీ తర్వాత రహానె రాకుండా జడేజా క్రీజులోకి రావడం గమనార్హం.
ఇదీ చూడండి..టాస్ గెలిచిన ఇంగ్లాండ్- టీమ్ఇండియా బ్యాటింగ్
Last Updated : Sep 2, 2021, 5:56 PM IST