తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC: పాయింట్ల పట్టికలో టీమ్​ఇండియా టాప్​ - కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్

టీమ్​ఇండియా వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​లో(World Test Championship) అదరగొడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

India lead WTC table with 14 points
టీమ్​ఇండియా

By

Published : Aug 25, 2021, 11:31 AM IST

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం టీమ్​ఇండియా(Team India) ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.

16పాయింట్లు రావాలి కానీ ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా ఐసీసీ, ఇరుజట్లకు రెండు పాయింట్ల కోత విధించింది.

టీమ్​ఇండియా

ఇంగ్లీష్ జట్టుతో ఆడిన తొలి టెస్టు వర్షం కారణంగా రద్దవగా, లార్డ్స్​లో(Lord's) జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో కోహ్లీసేన అద్భుత విజయం సాధించింది. అలానే ఐదు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టు(లీడ్స్) బుధవారం(ఆగస్టు 25) నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్​లోనూ గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని టీమ్​ఇండియా చూస్తుండగా, ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details