ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(2021-2023) పాయింట్ల పట్టికలో(WTC Points Table 2021-2023) టీమ్ఇండియా టాప్‌లో నిలిచింది. ఇంగ్లాండ్‌పై నాలుగో టెస్టు గెలిచిన అనంతరం ఈ స్థానం దక్కించుకుంది. ఓవల్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో(Ind vs Eng 4th test) 157 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది కోహ్లీసేన.
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో విజయం అనంతరం డబ్ల్యూటీసీ టేబుల్లో 26 పాయింట్లతో టీమ్ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పర్సెంటేజ్ 54.17 శాతంగా ఉంది. ఇంగ్లాండ్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా పాకిస్థాన్ 12 పాయింట్లు, 50 శాతం పాయింట్ల పర్సెంటేజ్‌తో రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
నాలుగో టెస్టు సాగిందిలా(Ind vs Eng 4th Test Highlights)
తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది భారత్. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(50), శార్దూల్ ఠాకూర్(57) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్ 3, జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ సాధించారు. ఆ తర్వాత బరిలో దిగిన ఆతిథ్య జట్టు.. 290 పరుగులకే ఆలౌటైంది.