టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(shardul thakur).. టెస్టు క్రికెట్లో తన రెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 31 బంతుల్లో 50 పరుగులు చేసి అదరగొట్టాడు. టెస్టుల్లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత ఫాస్టెస్ట్ హాఫ్‌సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కపిల్ 30 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నడు.
Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ రికార్డు.. కపిల్‌దేవ్ సరసన చోటు - శార్దూల్ ఠాకూర్ కపిల్ దేవ్ హాఫ్‌సెంచరీ
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో కపిల్ దేవ్ తర్వాత అలాంటి రికార్డును సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా?
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు మరోసారి కట్టిపడేశారు. దీంతో టీమ్‌ఇండియా 191 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (57; 36 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (50; 96 బంతుల్లో 8x4) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్ నాలుగు, రాబిన్‌సన్ మూడు వికెట్లు తీయగా అండర్సన్, ఓవర్టన్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి..మోకాలికి గాయమైనా సరే అండర్సన్ బౌలింగ్