సొంతగడ్డపై భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడి కసితో ఉంది ఇంగ్లాండ్. మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తర్వాతి మ్యాచ్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 25న జరగనున్న మూడో టెస్టు కోసం డేవిడ్ మలాన్‌ను జట్టులోకి తీసుకుంది ఇంగ్లాండ్. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్‌కు ఆహ్వానం అందింది.
అలాగే బ్యాట్స్‌మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్ లీచ్ పేరును కూడా స్క్వాడ్‌లో ప్రస్తావించలేదు. కానీ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. రోరీ బర్స్న్పై విమర్శలు వస్తున్నా మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది యాజమాన్యం. సిబ్లే గైర్హాజరుతో హసీబ్ హమీద్‌కు ఓపెనర్ అవకాశం రానుంది.