టెస్టుల్లో(Test Cricket) ఇంగ్లాండ్ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అత్యధిక డకౌట్ల ఫీట్‌ను రెండోసారి నమోదు చేశారు. ఈ ఏడాది ఆ టీమ్‌లోని ఆటగాళ్లు 40 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. 1998లో ఆ జట్టు ప్లేయర్లు అత్యధికంగా 54 సార్లు పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. ఈ క్యాలెండర్ ఇయర్లో మరోసారి ఈ ఊహించని ఫీట్ నమోదు చేసేలా ఉంది ఇంగ్లిష్ బృందం.
England vs India: టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు డకౌట్ల రికార్డు! - ఇంగ్లాండ్ జట్టు అత్యధిక డకౌట్లు
విజయవంతమైన క్రికెట్ జట్లలో ఇంగ్లాండ్(England) టీమ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ జట్టు ఓ చెత్త రికార్డును మరోసారి తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో అత్యధిక డకౌట్లు నమోదు చేశారు ఆ జట్టు బ్యాట్స్‌మెన్.
ప్రస్తుతం టీమ్ఇండియాతో(Team India) సొంతగడ్డపై ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతుంది. 1-0తో వెనుకబడింది. తొలి టెస్టులో ఆ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మెన్ సున్న పరుగులకే ఔటయ్యారు. మూడో టెస్టులో ఒక బ్యాట్స్‌మన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 1986, 2001, 2013లలో వరుసగా 33 సార్లు చొప్పున ఆ జట్టు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగిన చరిత్ర ఉంది.
ఇదీ చదవండి:IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. టీమ్ఇండియా 215/2