తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS ENG: టీ20ల్లో సూర్యకుమార్​ అరుదైన రికార్డు.. - టీమ్​ఇండియా వర్సెస్​ ఇంగ్లాండ్​

Surya kumar yadav record: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 టీమ్​ఇండియా ఓడిపోయినప్పటికీ.. అద్భుత శతకంతో మెరిసిన సూర్యకుమార్​ యాదవ్ మాత్రం​ పలు రికార్డులను అందుకున్నాడు. అవేంటంటే..

సూర్యకుమార్ యాదవ్​ రికార్డ్​
IND VS ENG surya kumar

By

Published : Jul 11, 2022, 11:44 AM IST

Surya kumar yadav record: ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా ఓడిపోయినప్పటికీ.. సూర్యకుమార్​ యాదవ్​ మాత్రం అద్భుత శతకంతో మెరిశాడు. అతడు పోరాడిన తీరు క్రికెట్​ అభిమానులను ఆకట్టుకుంది. 216 పరుగుల ఛేజింగ్‌లో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ఏమాత్రం బెదరకుండా కేవలం 48 బంతుల్లోనే సెంచరీ(117) చేశాడు. ఈ క్రమంలోనే అతడు టీ20ల్లో సెంచరీ చేసిన ఐదో ఇండియన్‌ బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్‌, రైనా, రాహుల్‌, దీపక్‌ హూడా తర్వాత సూర్య ఈ ఘనత సాధించాడు.

దీంతోపాటే టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో భారత బ్యాటర్​గానూ నిలిచాడు. అంతకుముందు రోహిత్​ 119 స్కోరు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. అలానే కేఎల్​ రాహుల్​(46బంతుల్లో) తర్వాత 100 పరుగలను అత్యంత వేగంగా(48 బంతుల్లో) చేసిన రెండో ఇండియన్​ బ్యాటర్​గానూ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్​తో సూర్యకుమార్​ టీ20 వరల్డ్​కప్​లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా రోహిత్​, కోహ్లీ లాంటి సీనియర్లు విఫలమవుతున్న సమయంలో సూర్య చెలరేగుతూ టీమ్​ఇండియాలో ఆశలు రేపుతున్నారు.

ఇదీ చూడండి: కపిల్​దేవ్​కు రోహిత్ కౌంటర్.. కోహ్లీ గురించి మీకేం తెలుసంటూ...

ABOUT THE AUTHOR

...view details