తెలంగాణ

telangana

By

Published : May 22, 2021, 1:18 PM IST

ETV Bharat / sports

టీమ్ఇండియా క్వారంటైన్ మూడు రోజులే!

ఇంగ్లాండ్​లో పర్యటించే టీమ్ఇండియా జట్లకు క్వారంటైన్​ ఆంక్షలను సడలించినట్లు సమాచారం. 10 రోజులుగా ఉన్న కఠిన క్వారంటైన్​ను ఈసీబీ 3 రోజులకు తగ్గించాలని చూస్తోందట. దీనివల్ల 4వ రోజు నుంచే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునే వీలు దొరుకుతుంది.

Team India
టీమ్ఇండియా

ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్లకు శుభవార్త! కఠిన క్వారంటైన్‌ ఆంక్షలను ఈసీబీ సడలించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ చర్చలతో 10 రోజుల కఠిన క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించిందని సమాచారం. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. సుదీర్ఘ పర్యటన కావడం వల్ల క్రికెటర్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లాండ్​కు పయనమవనున్నారు. వారికి మాత్రం పది రోజుల కఠిన క్వారంటైన్‌ ఉండనుందట. వీరికీ మినహాయింపు కల్పించేలా బోర్డు వర్గాలు చర్చలు జరుపుతున్నాయని అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం పురుషులు, మహిళల జట్లు, వారి కుటుంబాలతో సహా ముంబయిలో క్వారంటైన్లో ఉన్నాయి. జూన్‌ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్‌ విమానంలో బ్రిటన్‌కు వెళ్తాయి. కోహ్లీసేన నేరుగా సౌతాంప్టన్‌లో దిగి అక్కడి హోటళ్లలో క్వారంటైన్ అవుతుంది. మిథాలీ సేన బ్రిస్టల్‌కు వెళ్లి స్థానికంగా క్వారంటైన్ కానుంది. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ రెండు టెస్టుల సిరీసూ ఇదే సమయంలో జరుగుతుంది. దాంతో కివీస్‌ సభ్యులూ టీమ్‌ఇండియా క్రికెటర్లు ఒకే హోటళ్లలో ఉంటారని తెలుస్తోంది.

మిథాలీ సేన జూన్‌ 16న ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో తలపడుతుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. కాగా, జూన్‌ 18-22 వరకు కోహ్లీసేన, విలియమ్సన్‌ బృందంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తాడోపేడో తేల్చుకుంటుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు సిరీసు ఆడుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details