Abhimanyu Easwaran : బొటనవేలి గాయంతో బాధపడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాతో జరగబోయే మూడో వన్డేకు దూరం కానున్నాడు. అయితే అతడు డిసెంబర్ 14 నుంచిప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే హిట్ మ్యాన్ స్థానంలో ఆడేందుకు మరో ప్లేయర్‌ను తీసుకున్నట్లు తెలిసింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత టీమ్ ఏ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బంగ్లాతో టెస్ట్ సిరీస్.. హిట్ మ్యాన్ స్థానంలో ఆ సెంచరీల వీరుడు! - Rohit Sharma instead of Abhimanyu Easwaran
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయంతోనే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో అతడు బంగ్లాతో మూడో వన్డే సహా టెస్ట్ సిరీస్‌కు దూరం కానున్నాడు. అయితే అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. అతడు ఎవరంటే..
"అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా- ఎ టెస్టు మ్యాచ్‌లో రెండు వరుస శతకాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గానూ ఆడుతున్నాడు. సిల్‌హట్‌లో అతడు తన రెండో టెస్టు మ్యాచ్‌ను ముగించిన తర్వాత ఛట్టోగ్రామ్ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి" అంటూ బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఈశ్వరన్ మొదటి ఎ టెస్టులో 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాకౌట్‌గా 144 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. అయితే, ఇదే జట్టు నుంచి బెంగాల్ సీమర్ ముఖేశ్ కుమార్‌కు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడిన మహమ్మద్ షమీ స్థానాన్ని ముఖేశ్, ఉమ్రాన్ మాలిక్‌లలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశాలున్నాయి. మోకాలి గాయం తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని రవీంద్ర జడేజా టెస్టుల్లో ఆడుతుండటం వంటివి టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఇప్పటికే అక్షర్ పటేల్ జట్టులో ఉన్నాడు కాబట్టి టీమ్- ఎ నుంచి బ్యాక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా సౌరభ్ కుమార్ టెస్టు జట్టులో చేరొచ్చు. ఈ సారి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం సూర్యకుమార్‌కు ఆ స్థానం దక్కే అవకాశం కనపడుతోంది.