రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోచ్ ఆశావహులకు సరికొత్త 'కార్పొరేట్ శిక్షణ' తరగతులు జరుగుతున్నాయి. సెలక్షన్ ప్రక్రియలో ఒత్తిడి సహా ఫీల్డ్ వెలువల సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలతో కోచించ్ మ్యానువల్‌ను తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించి ప్రముఖ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు.. బీసీసీఐ లెవెల్ 2 కోర్సు పూర్తి చేసుకొని పరీక్షలకు కూడా హాజరయ్యారు.
ఏమిటీ కార్పొరేట్ శిక్షణ..
ఈ కోర్సును ఎంబీఏ చేసిన ముంబయి మాజీ సీమర్ క్షేమల్ వైంగన్కర్ రూపొందించారు. ఫీల్డ్ బయట ఉండే స్టేక్హోల్డర్లతో ఎలా వ్యవహరించాలి అనే అంశాన్ని కోర్సులో కొత్తగా చేర్చారు. దీనిద్వారా తన అవగాహన పరిధి పెరిగిందని ఓ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ తెలిపారు.
ఈ కోర్సు గురించి వివరిస్తూ.. "బేరానికి, చర్చకు మధ్య తేడా వివరించడమే శిక్షణ ముఖ్య ఉద్దేశం. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదని, క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించే పరిష్కార పద్ధతులే ప్రధానమని చెప్పారు. కోచ్, సెలక్టర్ బాధ్యతల్లో ఉన్నప్పుడు పై అధికారులు, అసిస్టెంట్లు, కెప్టెన్‌ను భిన్న అంశాలపై ఎలా ఒప్పించాలి? లాంటివి నేర్పుతారు," అని ఆ క్రికెటర్ వెల్లడించారు.
ద్రవిడ్ కోచింగ్ ఇస్తారా?
ఎన్సీఏ అధ్యక్షుడు ద్రవిడ్.. ఈ తరగతులను తీసుకోవడం లేదు. అయితే స్వయంగా ఆయనే ఓ విద్యార్థిలాగా వీటికి హాజరవుతుండటం ఓ విశేషం. శిక్షణ తీసుకునేవారితో పాటు ద్రవిడ్ కూడా సమస్యలకు పరిష్కారాలను ఆలోచిస్తారట. "ద్రవిడ్ తనను తాను విద్యార్థిలానే భావిస్తారు, నేర్చుకోవడం ఆపిన మరుక్షణం ఇక ముగింపని చెబుతారు," అని మరో క్రికెటర్ తెలిపారు.
ఇదీ చూడండి:కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్‌బై!.. ద్రవిడ్‌పైనే అందరి దృష్టి?