Shreyas Iyer Century in Test: టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న అతడు ఘనంగా టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అయ్యర్.. గావస్కర్ చెప్పిన సలహా ఏంటో బయట పెట్టేశాడు.
"క్యాప్ అందిస్తున్న సమయంలో సునీల్ గావస్కర్(Shreyas Iyer Sunil Gavaskar) సర్ నన్ను చాలా మోటివేట్ చేశారు. భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. ఆటను ఎంజాయ్ చేయమని చెప్పారు. తొలుత రాహుల్ ద్రవిడ్ సర్ టెస్టు క్యాప్ అందిస్తారేమో అనుకున్నా. అయితే, నేను ఊహించని విధంగా గావస్కర్ సర్ క్యాప్ అందించారు. ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లే. ఇద్దరిలో ఎవరు క్యాప్ అందించినా గర్వకారణమే. తొలి రోజు నా ఆట తీరు పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాను. ఓవర్ నైట్ బ్యాటర్‌గా తొలి రోజు ఆట ముగించడం వల్ల.. ఆ రోజు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 5 గంటలకే లేచాను. సెంచరీ చేసిన తర్వాత కొంచెం కుదుటపడ్డాను. ఆ అనుభూతి మరిచిపోలేనిది."
-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్