టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఐపీఎల్ సీజన్లో మహీ ఆడతాడో లేదోననే ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో నెట్స్‌లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం రెస్ట్ తీసుకొని మళ్లీ సిద్ధమవుతున్నాడు. గతేడాది విఫలమైన సీఎస్కే.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 2023లో ధోనీ.. హార్దిక్‌తో కలిసి 'షోలే 2'.. సోషల్‌మీడియాలో లైకులే లైకులు.. - ధోనీ ఐపీఎల్ 2023
నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ధోనీ.. ఈ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టి నెట్స్‌లో సాధన చేశాడు. అలాగే హార్దిక్‌తో కలిసి 'షోలే 2' పోజు ఇచ్చాడు.
ధోనీ హార్దిక్ 'షోలే 2
యే దోస్తీ..భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పంచుకున్నాడు. 'షోలే 2' త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టాడు. ప్రస్తుంత ఈ ఫొటో నెట్టింట్లో ట్రెండ్ అవతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి:ఇది మాకు కొత్తేమి కాదు.. తప్పకుండా జైషాతో చర్చిస్తా: PCB ఛైర్మన్