టీమ్ఇండియా శ్రీలంకకు సోమవారం పయనమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మందితో కూడిన ఈ జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సందర్భంగా క్రికెటర్లు అందరూ ఉన్న ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నారు. జులై 13 నుంచి జులై 25 వరకు మ్యాచ్లు జరగనున్నాయి.
అంతకు ముందు మీడియాతో ఆదివారం మాట్లాడిన ద్రవిడ్.. జట్టులోని యువ క్రికెటర్లకు ఇదో సువర్ణావకాశం అని అన్నారు. అందరికీ తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చని, సీనియర్ల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.