తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఊర్వశిరౌతేలాపై చాహల్ భార్య ఫన్నీ పోస్ట్​.. అందుకే పెట్టిందా? - ఊర్విశి రౌతేలాపై చాహల్ భార్య ఫన్నీ పోస్ట్

ఎప్పుడూ సోషల్​మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉండే టీమ్​ఇండియా క్రికెటర్​ చాహల్​ భార్య ధన శ్రీ.. తాజాగా చేసిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఆమె చేసిన పోస్ట్​.. బాలీవుడ్​ నటి ఊర్విశి రౌతేలాను ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఊర్వశిపై ఆమె సెటైర్​ వేసిందని అనుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..

.
.

By

Published : Oct 21, 2022, 6:54 PM IST

టీమ్​ఇండియా ఫాస్ట్ బౌలర్​ చాహల్​ భార్య ధనశ్రీ.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాపై సెటైర్​​ వేసిందా? ఆమెను ఆటపట్టిస్తుందా? అంటే అవుననే సమాధానం నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ధనశ్రీ చేసిన పోస్ట్ చూసి సోషల్​మీడియా యూజర్స్​ ఇదే అనుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే?

ప్రస్తుతం చాహల్​.. టీ20 ప్రపంచకప్​లో ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆదివారం తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో ఆడబోతున్నాడు. అయితే ఆ మ్యాచ్​ చూసేందుకు ధనశ్రీ.. ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకుంది. అయితే ప్రయాణ సమయంలో ఆమె ఇన్​స్టా వేదికగా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. 'నా ప్రేమ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నాను. నా భర్త కోసం ఇండియా కోసం అక్కడ ఉండాల్సిందే' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

అయితే ఇటీవలే క్రికెటర్​ పంత్​తో పరోక్షంగా సోషల్​మీడియా వార్​కు దిగిన నటి ఊర్వశి రౌతేలా కూడా ఇలాంటి పోస్టే చేసింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఫొటోను పోస్ట్​ చేసి.. "మనసును ఫాలో అయ్యా అది నన్ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది" అని క్యాప్షన్​ రాసుకొచ్చింది. అప్పుడు ఈ పోస్ట్​ తెగ వైరల్​ అయింది. పంత్​ పట్టించుకోకపోయినా అతడి కోసమే ఆమె విదేశాలకు వెళ్తోందని ఊర్వశిని తెగ ట్రోల్​ చేశారు. ఇకపోతే వీరిద్దరు పోస్ట్ చేసిన ఫొటోలు గమనిస్తే ఇంచుమించు ఊర్వశిలానే పోజు ఇచ్చింది ధనశ్రీ. దీంతో ధనశ్రీ చేసిన పోస్ట్ వైరల్​ అయింది. ఇది చూసిన నెటిజన్స్​.. ధనశ్రీ కావాలనే ఊర్వశిని ఆటపట్టించడానికి రిక్రియేట్​ పోస్ట్​ చేసిందని విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

.

కాగా, కొంతకాలంగా పంత్​-ఊర్వశి రేతేలా మధ్య జరుగుతున్న సోషల్​మీడియా వార్​ తెలిసిందే. వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్​టాపిక్​గా మారారు. ముఖ్యంగా ఊర్వశి.. పంత్​ పేరు ప్రస్తావించకుండానే అతడి గురించి ఏదో ఒకటి పరోక్షంగా పోస్ట్​లు పెడుతూనే ఉంది. దానికి అతడు కూడా మొదట్లో ఘాటుగానే బదులిచ్చాడు. కానీ ఆ తర్వాత అతడు ఆపేసిన ఊర్వశి మాత్రం పంత్​ గురించి పరోక్షంగా పోస్ట్​లు ఇంకా పెడుతూనే ఉంది.

ఇదీ చూడండి:కత్రినకు విక్కీ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details