David Warner Captaincy : కెప్టెన్సీ చేపట్టకుండా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై జీవితకాల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా తన దరఖాస్తును విరమించుకుంటున్నట్టుగా వార్నర్ బుధవారం ప్రకటించాడు. ఈ సందర్భంగా బోర్డు స్వతంత్ర ప్యానెల్, కౌన్సిల్ సహాయక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'నా ఫ్యామిలీని బలి చేయలేను'.. ఆసీస్ క్రికెట్ బోర్డ్‌పై వార్నర్ ఫుల్ సీరియస్
కెప్టెన్సీ చేపట్టకుండా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై జీవితకాల నిషేధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. మళ్లీ తన దరఖాస్తును విరమించుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఈ సందర్భంగా బోర్డు స్వతంత్ర ప్యానెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం. కేప్‌టౌన్‌లో మూడో టెస్టు సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను నాతో పాటు నా కుటుంబం ఎదర్కోవలసి వచ్చింది. నాపై నిషేధం ఉన్నప్పటికీ ఆరోజు నుంచి నన్ను నేను ఆట పరంగా సంస్కరించుకోవడానికి కృషి చేశాను. క్రికెట్‌కు నా సేవలు అందించాను. అయినా, నేను అనుభవిస్తున్న శిక్ష నుండి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నాను. గత నవంబర్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రవర్తనా నియమావళిని సవరించింది. అది నాలో కొత్త ఆశలను రేకెత్తించింది. నాపై ఉన్న నిషేధంపై సమీక్షను కోరేందుకు ఒక అవకాశం లభించిందని అనుకున్నాను.
కానీ, ఇటీవల ఈ విషయంలో కౌన్సిల్ న్యాయవాది నాపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2018 న్యూజిలాండ్ పర్యటన సమయంలో అసలేం జరిగిందనే విషయంపై వారు బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్యానెల్ మాటల్లో చెప్పాలంటే వారు క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఆ సంఘటనపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని ప్యానెల్ నిర్ణయించింది. అయితే దీని వల్ల నా కుటుంబం సభ్యులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ చెత్త ఎపిసోడ్‌ను క్లీన్ చేసేందుకు వాషింగ్ మెషీన్‌లా నేను సిద్ధంగా లేను" అని వార్నర్ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశాడు.