తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా బౌలింగ్​ కోచ్​గా డేల్ స్టెయిన్!

భారత జట్టు బౌలింగ్ కోచ్​గా తనను నియమించాలని కోరాడు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్(Steyn News). ఇదే నిజమైతే భారత క్రికెట్​ అభిమానలు పండగే!

dale steyn
డేల్ స్టెయిన్

By

Published : Oct 17, 2021, 6:16 PM IST

టీమ్​ఇండియాకు బౌలింగ్​ కోచ్​గా ఉండేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్(Steyn News) ఆసక్తి కనబరిచాడు. ఓ క్రీడాఛానల్​ చేసిన ఇన్​స్టా పోస్ట్​కు స్టెయిన్ రిప్లై ఇచ్చిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ధోనీకి మెసేజ్..

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ నేపథ్యంలో టీమ్​ఇండియాకు మెంటార్​గా ధోనీని(Dhoni Mentor) నియమించింది బీసీసీఐ. ఈ క్రమంలో.. 'ధోనీతో ఫోన్​ కాల్​లో ఉంటే.. ఆయనకు మీరు ఏం చెబుతారు?' అని సదరు ఛానల్​ ఓ పోస్ట్​ పెట్టింది. దీనికి బదులిచ్చిన డేల్ స్టెయిన్. 'టీమ్​ఇండియా బౌలింగ్​ కోచ్​గా నన్ను నియమించమని అడుగుతా' అని కామెంట్ చేశాడు.

స్టెయిన్ కామెంట్ చేసిన కొద్ది సేపటికే ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. టీమ్​ఇండియా బౌలింగ్​ కోచ్​గా అతడిని నియమిస్తే బాగుంటుందని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

స్టెయిన్ రిప్లై

మరోవైపు టీమ్​ఇండియా కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్​(Dravid New Coach) చేపట్టనున్నాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. పరాస్​ మాంబ్రే(Paras Mhambrey cricket) బౌలింగ్​ కోచ్​ పదవి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. ఇక )భారత పురుషుల జట్టుకు కొత్త కోచింగ్​ బృందం కోసం నేడు(అక్టోబర్​ 1 దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ.

టీ20 ప్రపంచకప్​ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు రవిశాస్త్రి ఇటీవలే పేర్కొన్నాడు. మెగా టోర్నీ తర్వాత బౌలింగ్​ కోచ్​ బాధ్యతలు కొనసాగించనని భరత్ అరుణ్​ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచింగ్​ బృందం కోసం ప్రస్తుతం బోర్డు చర్చలు జరుపుతోంది.

ఇదీ చదవండి:

Dravid coach: టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్.. 2023 ప్రపంచకప్​ వరకు

టీమ్​ ఇండియాకు కొత్త కోచ్​.. బీసీసీఐ ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details