తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారి సలహాలతో ప్రపంచకప్​లో సత్తాచాటుతా' - ponting

పాంటింగ్, గంగూలీ నుంచి చాలా నేర్చుకున్నాని భారత ఓపెనర్​ శిఖర్ ధావన్ తెలిపాడు. వారిద్దరూ దిల్లీకి మెంటర్లుగా ఉండటం తన అదృష్టమని చెప్పాడు. ధావన్​ ప్రస్తుత ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు ఆడుతున్నాడు.

ధావన్

By

Published : Apr 25, 2019, 12:54 PM IST

దిల్లీ క్యాపిటల్స్​కు మెంటర్లుగా ఉన్న రికీ పాంటింగ్, గంగూలీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు శిఖర్ ధావన్. వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ప్రపంచకప్​లో వాటిని ఉపయోగించి సత్తాచాటుతానని ధావన్ తెలిపాడు. ఐపీఎల్​లో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ గబ్బర్.

"రికీ పాంటింగ్, గంగూలీ మా జట్టుకి మెంటర్లుగా ఉండటం నా అదృష్టం. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్​లో సత్తాచాటుతా" -శిఖర్​ ధావన్, భారత ఓపెనర్

128 వన్డేలాడిన ధావన్ 5,355 పరుగులు చేశాడు. ప్రపంచకప్​ జట్టులో చోటు సాధించిన ఈ ఓపెనర్​ ప్రస్తుతం ఐపీఎల్​లో సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్​లో 11 మ్యాచ్​లాడి 401 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మే 30 నుంచి ఇంగ్లండ్​లో ప్రపంచకప్​ జరుగనుంది.

ABOUT THE AUTHOR

...view details