తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అఫ్రిదీని అవమానించారు.. నేనే సాక్ష్యం'

సీనియర్ ఆటగాళ్లపై అఫ్రిదీ రాసిన విషయాలు నిజమేనని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తెలిపాడు. షాహిద్ చాలా సార్లు అవమానాలు ఎదుర్కున్నాడని, వాటికి తానే సాక్ష్యమని చెప్పాడు.

By

Published : May 9, 2019, 7:07 PM IST

అక్తర్

పాక్​ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీకి మద్దతుగా నిలిచాడు షోయబ్ అక్తర్. సీనియర్ ఆటగాళ్లు అఫ్రిదీని చాలా సార్లు అవమానించారని, వాటికి తానే సాక్ష్యమని చెప్పాడు అక్తర్. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లపై తన పుస్తకం గేమ్​ ఛేంజర్​ లో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు అఫ్రిదీ.

షాహిద్ తన పుస్తకంలో చాలా తక్కువ విషయాలే రాశాడు. సీనియర్ ఆటగాళ్ల నుంచి అతడు చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నేను నా కళ్లతో చూశాను. ఈ విషయంలో అఫ్రిదీకి నేను మద్దతు తెలుపుతున్నా- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్

కొన్ని ఏళ్ల తర్వాత 10 మంది సీనియర్ ఆటగాళ్లు అఫ్రిదీని క్షమాపణ కూడాఅడిగారని అక్తర్ చెప్పాడు. ఆస్టేలియా పర్యటనలో నలుగురు ఆటగాళ్లు తన మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని ఈ మాజీ పేసర్ ఓ టీవీ షోలో తెలిపాడు.

1999లో భారత్​తో టెస్టు మ్యాచ్​ సందర్భంగా నెట్స్​లో ముందు ప్రాక్టీస్​ చేయడానికి జావేద్ మియాందాద్ ఒప్పుకోలేదని అఫ్రిదీ తన పుస్తకంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details