తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​కు మద్దతుగా నిలిచిన యువరాజ్ సింగ్ - Pietersen

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో సెమీస్​ మ్యాచ్​లో పంత్​ ఔట్ కావడంపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్, భారత్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్​లో  చర్చించుకున్నారు. పంత్​ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాడని, ఈ సమయంలో అతడ్ని తప్పుపట్టడం సరికాదని యూవీ అన్నాడు.

యువరాజ్ సింగ్-పంత్

By

Published : Jul 11, 2019, 10:52 PM IST

బుధవారం కివీస్​తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. నిలవాల్సిన సమయంలో రిషబ్ పంత్ ఔట్ ​కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడికి మద్దతుగా నిలిచాడు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్.

"రిషబ్‌పంత్ ఇలా ఔట్ కావడం ఎన్నిసార్లు చూడలేదు ? ఇది బాధకరమైన విషయం" - ట్విట్టర్​లో కెవిన్ పీటర్సన్

దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంత్​కు మద్దతుగా నిలిచాడు.

"పంత్ కేవలం 8 వన్డేలే ఆడాడు. ఓడిపోవటం అతని తప్పు కాదు. ఇప్పుడిప్పుడే ఆటను నేర్చుకుని మెరుగుపడుతున్నాడు. పంత్ ఎంపిక దయనీయమైనది కాదు! అయితే ఇక్కడ అభిప్రాయాలు పంచుకోవడం తప్పుకాదు." -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్

ఈ మ్యాచ్​లో 71 పరుగుల వద్ద ఐదో వికెట్​గా వెనుదిరిగాడు రిషబ్ పంత్. అనంతరం చివరి వరకు పోరాడినా 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్​మీట్​లో పంత్​ను సమర్ధించాడు భారత కెప్టెన్ కోహ్లీ. అతడికి ప్రస్తుతం 21 సంవత్సరాలేనని, తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడని అన్నాడు.

ఇది చదవండి:స్మిత్​ అద్భుత పోరాటం... ఇంగ్లాండ్​ లక్ష్యం 224

ABOUT THE AUTHOR

...view details