తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...' - happy birthday dhoni

టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో మహీకి క్రీడాకారులు, సినీ తారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

ధోనీ

By

Published : Jul 7, 2019, 12:07 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఆదివారం 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరుపుకున్నాడు.

ధోని చేయి పట్టుకుని కేక్ కట్ చేయించింది కూతురు జివా. టీమిండియా సభ్యులు కేదార్ జాదవ్, హర్డిక్ పాండ్య ధోని ముఖానికి కేక్ పూసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ధోని సతీమణి సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సామాజిక మాధ్యమాల్లో మహేంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ఆటగాళ్లు, వేర్వేరు రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్​డే విషెస్​ చెబుతున్నారు.

ట్విట్టర్​లో తరచూ తన ఫన్నీ మెసేజ్​లో వ్యంగ్యాస్త్రాలు సంధించే సెహ్వాగ్.. ధోనీకి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. "ప్రపంచంలో ఏడు దేశాలు, వారానికి ఏడు రోజులు, రెయిన్​బోలో ఏడు రంగులు, సంగీతంలో ఏడు స్వరాలు, మనుషుల్లో ఏడు చక్రాలు, పెళ్లిలో ఏడు అడుగులు, ప్రపంచంలో ఏడు వింతలు.. ఏడో నెల.. ఏడో తారీఖు.. ప్రపంచ క్రికెట్ అద్భుతానికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని రాసుకొచ్చాడు సెహ్వాగ్.

"నీ జీవితంలో అంతా మంచే జరగాలి. అదృష్టం, ప్రేమ, విజయం నీ వెంట ఉండాలి" అంటూ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

"2004లో బంగ్లాదేశ్​తో మొదటిసారి కలిసి ఆడాం. వైజాగ్​లో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​పై 148 పరుగులు చేసి ప్రపంచానికి నీవేంటో పరిచయం చేశావు. తర్వాత తిరిగి చూసుకోలేదు. దినదినాభివృద్ధి చెందుతూ సాగావు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ భారత మాజీ క్రికెటర్ కైఫ్ ట్వీట్ చేశాడు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. నా జీవితంలో గొప్ప రోల్ మోడల్​గా ఉన్నందుకు ధన్యవాదాలు" అంటూ పాండ్య ధోనితో కూడిన సరదా వీడియోను పోస్ట్ చేశాడు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. నా జీవితంలో మెంటార్​గా, సోదరుడిగా, స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. జీవితంలో నీవు మరిన్ని విజయాలను అందుకోవాలి" అంటూ రిషభ్ పంత్​.. ఓ సరదా వీడియోను పోస్ట్ చేశాడు.

"నాలుగు ప్రపంచకప్​లు. నాలుగు విభిన్న వేషధారణలు. ఇందులో మీకేది ఎక్కువ ఇష్టం" అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

"పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. నీ మీద ఉన్న ప్రేమను తెలియజేయడానికి మాటలు సరిపోవట్లేదు. నీ జీవితం ఆనందగా, ఆరోగ్యంగా మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుంటున్నా" అంటూ కేదార్ జాదవ్ ట్వీట్ చేశాడు.

"హ్యాపీ బర్త్​డే" అంటూ కూతురు జివా, ధోనితో కూడిన ఫొటోను షేర్ చేసింది మహీ సతీమణి సాక్షి.

"పుట్టినరోజు శుభాకాంక్షలు ధోని. మరో అద్భుతమైన ఏడాది నీ ముందుంది".. అంటూ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ట్వీట్ చేసింది.

ఇవీ చూడండి.. WC19: 'రికార్డులు కాదు.. ట్రోఫీ ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details