ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ క్రికెట్ అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ అభిమాని పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌ను పందిగా సంబోధించడం చర్చనీయాంశమైంది. తర్వాత తన తప్పును తెలుసుకుని అభిమాని ఆ వీడియోను డిలిట్ చేశాడు. అయితే ఆ వీడియో చూసి తన భార్య కన్నీరు పెట్టుకుందని సర్ఫరాజ్ తెలిపాడు.
“నేను నా గదికి వెళ్లి చూశా. నా భార్య ఆ వీడియో చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది. అప్పుడు నేను తనకు చెప్పా. క్రికెట్ అభిమానులు చాలా సున్నితంగా ఉంటారని.. వారి ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలని.”
-సర్ఫరాజ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్
ఆ వీడియో చూసిన తర్వాత పలువురు అభిమానులు సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచారు. దేశ క్రికెట్ కెప్టెన్‌ను అలా అనడం సరికాదని వీడియో పోస్ట్ చేసిన అభిమానిపై విరుచుకుపడ్డారు. ఎవరైనా.. ఎవరినైనా విమర్శించవచ్చని.. కానీ వ్యక్తిగత దూషణలు సరికాదని పాక్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు.
“ఆ వీడియో చూసి నేనూ చాలా బాధపడ్డా. ఆ అభిమానికి నేను కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ అలా చేస్తే నాకు, అతడికి పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం పాక్ అభిమానుల నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది”.
-సర్ఫరాజ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్