ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. అభిమానులకు నిరాశ మిగిల్చింది. కొందరు జట్టుకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని అంటున్నారు పలువురు. ఆ స్థానంలో రోహిత్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించాలి కోరాడు. 2023 ప్రపంచకప్ జట్టుకు హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.